Header Banner

చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో 'ఒకే ఒక్కడు'!

  Thu May 08, 2025 14:38        Sports

బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 2 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. నిన్న‌టి మ్యాచ్‌లో ఎంఎస్‌డీ అజేయంగా 18 పరుగులు చేశారు. త‌ద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే మరే ఇతర ఆటగాడు సాధించని ప్రత్యేకమైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. మ‌హీ ఇప్పటికే అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆట‌గాళ్ల‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండ‌గా... ఇప్పుడు అతను 100 సార్లు నాటౌట్ అనే మైలురాయిని కూడా సాధించాడు. మొత్తం 241 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను న‌మోదు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోనీ త‌ర్వాత రెండో స్థానంలో సీఎస్‌కే ఆల్‌రౌండ‌ర్ రవీంద్ర జడేజా ఉన్నాడు.

 

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

అతను 80 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక, ఈ సీజ‌న్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కే 12 మ్యాచులాడి కేవ‌లం మూడింట మాత్ర‌మే గెలిచింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో ఉంది. మ‌రోవైపు నిన్న‌టి మ్యాచ్‌లో ఓడిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కు కూడా ప్లేఆఫ్స్ అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టంగా మారాయి. ఆ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులాడి ఐదు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. కేకేఆర్ ఖాతాలో ప్ర‌స్తుతం 11 పాయింట్లు ఉన్నాయి. మిగ‌తా రెండు మ్యాచుల్లో గెలిస్తే 15 పాయింట్లు అవుతాయి. కానీ, ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేర‌డానికి ఇవి స‌రిపోవు. ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia